ప్రభుత్వ రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇసుక రవాణా చేయాలి : రామగుండం సీపీ శ్రీనివాస్

ప్రభుత్వ రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇసుక రవాణా చేయాలి : రామగుండం సీపీ శ్రీనివాస్

 

ముత్తారం, వెలుగు: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక రవాణా చేయాలని  రామగుండం సీపీ శ్రీనివాస్ సూచించారు. గురువారం ముత్తారం మండలం ఖమ్మంపల్లి జీపీ పరిధిలోని తాడిచర్ల బ్లాక్ 1,2 ఇసుక క్వారీలను సీపీ  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్వారీల్లో ఉన్న ఇసుక నిల్వలపై, డంపింగ్‌‌‌‌‌‌‌‌, లోడింగ్‌‌‌‌‌‌‌‌ వివరాలపై ఆరా తీశారు.

లారీలు ఓవర్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌తో వెళ్లకుండా నిత్యం తనిఖీలు చేపట్టాలన్నారు. అనంతరం పోలీస్‌‌‌‌‌‌‌‌ వాహనాలను వేబ్రిడ్జి పైకి ఎక్కించి దాని పనితీరును పరిశీలించారు. ఆయన వెంట డీసీపీ చేతన, ఏసీపీ మడత రమేశ్‌‌‌‌‌‌‌‌, సీఐ రాజు, ఎస్సై నరేశ్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. 

గంజాయి, ఇసుక రవాణాపై నిఘా పెట్టాలి 

జగిత్యాల రూరల్, వెలుగు: ప్రభుత్వ రూల్స్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలు, రవాణాపై నిఘా పెట్టాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్‌‌‌‌‌‌‌‌ అధికారులను అదేశించారు. గురువారం ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో నెలవారీ క్రైమ్‌‌‌‌‌‌‌‌ రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ తోనే  శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. అందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు.

పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో పలు పీఎస్‌‌‌‌‌‌‌‌లలో నమోదైన గంజాయి కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. నిందితుల కదలికలను గమనిస్తూ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, రంగారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.