ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌కు నీటి కష్టాలు .. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో తగ్గుతున్న నీటి నిల్వలు

  • ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ వరకే సప్లై చేస్తామన్న ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌కు లెటర్‌‌‌‌‌‌‌‌
  • ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో చర్చిస్తున్న సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కెమికల్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌) ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు నీటి కష్టాలు ఎదురుకానున్నాయి. ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి సప్లై చేస్తున్నారు. అయితే కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటి పంపింగ్‌‌‌‌‌‌‌‌ జరగకపోవడంతో అక్కడ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ వరకే వాటర్‌‌‌‌‌‌‌‌ సప్లై చేస్తామని, ఆ తర్వాత చేయలేమని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. 

ప్రతి ఏటా 0.55 టీఎంసీల నీరు అవసరం

గ్యాస్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా నడిచే రామగుండం ఫర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కెమికల్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో ప్రతి రోజు 2,200 మెట్రిట్‌‌‌‌‌‌‌‌ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్‌‌‌‌‌‌‌‌ టన్నుల యూరియా తయారవుతోంది. అమ్మోనియా తయారీ కోసం ప్రతి గంటకు 1,100 క్యూబిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల వాటర్‌‌‌‌‌‌‌‌ అవసరం ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి పైప్‌‌‌‌‌‌‌‌లైన్ల ద్వారా ఏటా 0.55 టీఎంసీల నీటిని ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌కు సప్లై చేస్తేనే ప్లాంట్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. ఇందుకోసం ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకంగా రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. ఇందులో మూడు రోజులకు అవసరమైన నీటిని నిల్వ చేస్తుంటారు. 

ఎల్లంపల్లిలో తగ్గుతున్న నీటి నిల్వలు

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌కు నీటి సరఫరా జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంతో, అన్నారం బ్యారేజీకి బుంగలు పడడంతో నీటిని నిల్వ చేయలేక కిందికి వదిలేశారు. వీటితో పాటు ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు సుందిళ్ల బ్యారేజీ గేట్లను కూడా ఎత్తి అక్కడి నీటిని కూడా వదిలేశారు. ప్రస్తుతం ఈ మూడు బ్యారేజీలు ఖాళీగా ఉండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి నీటి పంపింగ్‌‌‌‌‌‌‌‌ నిలిచిపోయింది. దీంతో ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌కు నీటి కష్టాలు మొదలయ్యాయి.

తాగునీటి అవసరాల కోసమే...

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మెట్రో వాటర్‌‌‌‌‌‌‌‌ సప్లైతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని వివిధ గ్రామాలకు మూర్మూర్​వద్ద గల పంప్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌ నుంచి నీటిని సరఫరా చేస్తుంటారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ మొత్తం నీటి నిల్వ కెపాసిటీ 148 మీటర్లుగా నిర్ణయించారు. కాళేశ్వరం బ్యారేజీల నుంచి నీటి పంపింగ్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో ఎల్లంపల్లిలో ప్రస్తుతం 142 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో నీటి నిల్వ 138 మీటర్ల వరకు చేరితే తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది.

దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ వరకే ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌కు నీటి సరఫరా చేయగలమని, ఆ తర్వాత ఆపివేస్తామని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని లెటర్‌‌‌‌‌‌‌‌లో సూచించారు. దీంతో ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఈ విషయాన్ని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. నీటి సప్లై ఆపివేయడంపై పునరాలోచన చేయాలని సెంట్రల్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు రాష్ట్ర ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో చర్చలు జరుపుతున్నారు.