బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు రామగుండం మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌ రాజీనామా

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ తొలి మహిళా మేయర్‌‌‌‌‌‌‌‌ జాలి రాజమణి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి రాజీనామా చేశారు. రిజైన్​లెటర్​ను ఆదివారం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడికి ఫ్యాక్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. రాజమణి 13వ డివిజన్‌‌‌‌‌‌‌‌ నుంచి 2014లో కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌గా గెలిచారు. 2018 చివరిలో మేయర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన కొంకటి లక్ష్మీనారాయణపై కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టడంతో ఆయన తప్పుకున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా జాలి రాజమణి మేయర్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. 

తొమ్మిది నెలల పాటు మేయర్‌‌‌‌‌‌‌‌గా పని చేసిన ఆమె పట్టణ మహిళా సమాఖ్యకు అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. రాజమణి మొదటి నుంచి సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పనిచేస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, తర్వాత టీడీపీ, మళ్లీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీల్లో  సోమారపు సత్యనారాయణ చేరగా ఆయన వెంటే నడిచారు. కాగా సత్యనారాయణ బీజేపీలో చేరిన తర్వాత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నారు. 

అయితే, ఐదు నెలలుగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ నుంచి రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉండనున్న సత్యనారాయణకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి రాజీనామా చేశానని రాజమణి తెలిపారు.