అనుచిత వ్యాఖ్యలు చేస్తే బడిత పూజ చేస్తాం

అనుచిత వ్యాఖ్యలు చేస్తే  బడిత పూజ చేస్తాం

దళారులను నమ్మి మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీనిచ్చారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బడిత పూజా చేస్తామని..ఇకపై దేనికైనా సిద్ధమేనన్నారు. రామగుండంలో రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గోదావరిఖని క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. అధికార పార్టీని కావాలనే ప్రతిపక్షాలు బద్నాం చేస్తున్నాయని, రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కి లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. దళారులను వదిలి పెట్టి, మంత్రి కొప్పుల ఈశ్వర్ పై, తనపై ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఒక్క బాధితునికి అన్యాయం జరగకుండా చూస్తామని హామీనిచ్చారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన దళారులు ఏ పార్టీవారైనా, మిత్రులైనా, బంధువులైనా వదిలేది లేదని అన్నారు. వారి డబ్బులు వెంటనే చెల్లించాలని లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

RFCL ఉద్యోగ బాధితుడు ముంజ హరీశ్ (32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కమాన్ పూర్ మండలం గుండారం వద్ద హరీశ్ డెడ్ బాడీని పోలీసులు కనుగొన్నారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు హరీశ్ శుక్రవారం వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. RFCL ఉద్యోగం కోసం తన నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని,  కొత్త కాంట్రాక్టర్ రాగానే తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని ఆవేదనం వ్యక్తం చేశాడు. దళారులను నమ్మి మోసపోయాయని వాపోయాడు. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.