గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కాంగ్రెస్‌తోనే సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని కోరుతూ సింగరేణి ప్రాంతంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్, సింగరేణి సెక్యూరిటీ వింగ్ ఆఫీస్‌ల వద్ద ఉద్యోగులను కలిసి ఓటు అభ్యర్థించారు. అలాగే రాజన్న కులస్తులతో, 8వ, 10వ డివిజన్లలో జరిగిన కార్నర్ మీటింగ్‌లలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి, అధిక ధరలు, నిరుద్యోగంతో ప్రజలను ఇబ్బందులు పడ్డారన్నారు. చీఫ్ విప్‌గా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతానికి, కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయన వెంట మేయర్ అనిల్ కుమార్, ఐఎన్‌టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ఎస్.నర్సింహరెడ్డి, పి.ధర్మపురి, లక్ష్మీపతిగౌడ్, కె.సదానందం, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
‘ఖని’లో సీపీఎం పార్లమెంటరీ స్థాయి మీటింగ్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, మత విద్వేష రాజకీయాలకు బుద్ధి చెప్పాలంటే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి యాకయ్య, మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు అన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపును కాంక్షిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖనిలో పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
మనాలీ ఠాకూర్ ప్రచారం
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్ బుధవారం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని, లీడర్లు ప్రకాశ్, జోనల్ క్లస్టర్ రవికుమార్ పాల్గొన్నారు.