గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, వాటిని చూడలేకపోతే ప్రతిపక్ష పార్టీల లీడర్లు కండ్లు మూసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. బుధవారం క్యాంప్‌ఆఫీస్‌లో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రామగుండం నియోజకవర్గాన్ని బొందలగడ్డగా మార్చారని విమర్శించారు.
వారి హయాంలో చేసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే చర్చకు రావాలని సవాల్‌చేశారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మెడికల్‌కాలేజీ సింగరేణి డీఎంఎఫ్టీ స్కీమ్‌కు చెందిన రూ.500 కోట్లతో ఏర్పాటు చేశారని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రూ.300 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు.
బండలవాగు లిఫ్ట్ పూర్తయిందని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రూ.150 కోట్లతో పాలకుర్తి లిఫ్ట్ డీపీఆర్ తయారవుతుందని, ఇది పూర్తయితే నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని తెలిపారు. కోల్ బెల్ట్ ప్రాంతాన్ని ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్ సంస్థల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని