- రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ యూనియన్ గెలిస్తేనే అవినీతి రహిత పాలన అందుతుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. సోమవారం రామగుండం రీజియన్ పరిధిలోని 11 ఇంక్లైన్, వకీల్‌పల్లి మైన్, వర్క్‌షాప్, ఏరియా హాస్పిటల్.. గేట్ మీటింగ్‌లతో పాటు గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీటింగ్‌లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బార్డర్‌లో పనిచేస్తున్న సైనికుల్లాగానే సింగరేణి గని కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తుచేశారు.
కార్మికులకు 250 గజాల స్థలంలో సొంతిల్లు నిర్మించుకునేందుకు రూ.20 లక్షల వడ్డీలేని రుణాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు ఐఎన్‌టీయూసీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఎస్.నర్సింహరెడ్డి, పి.ధర్మపురి, కె.సదానందం, బొంతల రాజేశ్, మహాంకాళి స్వామి, శంకర్‌నాయక్, ప్రకాశ్, రాజిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.