సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిది : రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, వారికి ఏ ఆపద వచ్చినా అండగా నిలబడతానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌ రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌ అన్నారు. సోమవారం జీడీకే 5 ఓపెన్‌‌‌‌కాస్ట్‌‌‌‌పై ఉన్న దుర్గాదేవి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గని అధికారులు ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల శ్రమను గుర్తించాలని అసెంబ్లీకి సింగరేణి దుస్తులతో వెళ్లాలని చెప్పారు.

సింగరేణిలో అవినీతికి తావు లేకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు క్యాంపు ఆఫీస్‌‌‌‌లో ప్రజా దర్బార్‌‌‌‌ నిర్వహిస్తానన్నారు. అసింగరేణి ఐఎన్‌‌‌‌టీయూసీ రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. లీడర్లు పెంచాల తిరుపతి, జనగామ శ్రీనివాస్ గౌడ్, సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్‌‌‌‌, కార్పొరేటర్లు, నాయకులు స్వామి, సుజాత, రాజేశ్‌‌‌‌, ముస్తఫా, ప్రకాశ్‌‌‌‌, కృష్ణ, మోహన్ పాల్గొన్నారు.

 కారుణ్య నియామకాలు చేపడుతాం

సింగరేణి ఉద్యోగులు మెడికల్‌‌‌‌ అన్‌‌‌‌ఫిట్‌‌‌‌ అయితే ఎలాంటి లంచాలు లేకుండా వారి స్థానంలో కారుణ్య నియామకాలు చేపడతామని ఐఎన్‌‌‌‌టీయూసీ సెక్రటరీ జనరల్‌‌‌‌ బి.జనక్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ అన్నారు. సింగరేణి ఆర్జీ 2 డివిజన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ 3 ప్రాజెక్ట్‌‌‌‌, బేస్‌‌‌‌ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో జరిగిన గేట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.

సింగరేణి మనుగడ సాగించాలంటే ఐఎన్‌‌‌‌టీయూసీని గెలిపించాలన్నారు. కార్యకరమంలో లీడర్లు కొత్త సత్యనారాయణ రెడ్డి, ప్రసాద్‌‌‌‌, వంగ లక్ష్మిపతిగౌడ్‌‌‌‌, అక్బర్‌‌‌‌ అలీ, అక్రమ్‌‌‌‌, శంకర్‌‌‌‌ నాయక్‌‌‌‌, వికాస్‌‌‌‌ కుమార్‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు. జీడీకే 2వ గని వద్ద జరిగిన గేట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో యూనియన్‌‌‌‌ సీనియర్‌‌‌‌ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్లు ఎస్‌‌‌‌.నర్సింహరెడ్డి, పి.ధర్మపురి మాట్లాడారు.