గోదావరిఖని, వెలుగు: గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రణాళికాలోపంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లో మార్పులు చేసి వినియోగంలోకి తేవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అధికారులకు సూచించారు. శుక్రవారం మేయర్ అనిల్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే షిపింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. రూ.వందల కోట్ల ఐడీఎస్ఎంటీ స్కీం నిధులతో 78 గదులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించినా దానిలో ఎవరూ వ్యాపారాలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.