- రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని మెయిన్ చౌరస్తా సమీపంలోని గాంధీ మార్కెట్‌లో నిర్మించే కమర్షియల్షాపింగ్కాంప్లెక్స్తో ఈ ప్రాంత రూపు మారనున్నదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శనివారం రూ.15 కోట్ల సింగరేణి నిధులతో 344 రూమ్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరిఖని ప్రాంతాన్ని మహానగరంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
సింగరేణి ద్వారా 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్‌ప్లాంట్‌ను మేడిపల్లి ఓపెన్ కాస్ట్ వద్ద నిర్మించనున్నారని, దాని వల్ల చాలా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల మూడు యూనిట్లు, రామగుండం టౌన్లోరాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల సూపర్క్రిటికల్పవర్ ప్లాంట్ రాబోతున్నాయన్నారు. అనంతరం క్యాంప్ ఆఫీస్‌లో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో సింగరేణి జీఎం డి.లలిత్ కుమార్, ఏసీపీ ఎం.రమేశ్, మేయర్ అనిల్ కుమార్, మనాలి ఠాకూర్, పోషం, వేణుగోపాల్‌రావు, అలేఖ్య, స్వర్ణలత పాల్గొన్నారు.