గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని ఓసీపీ 3లో శుక్రవారం కార్మికులు అమ్మవారిని బోనాలతో కొలిచారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పోతరాజుల నృత్యానికి అనుగుణంగా డప్పు కొట్టారు.
అలాగే యైటింక్లయిన్ కాలనీ వాటర్ ట్యాంక్ చౌరస్తా నుంచి ప్రాజెక్ట్‌లోని కృషి భవన్ వరకు బోనం ఎత్తుకుని వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్మికులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి కృప, ఆశీస్సులు రామగుండం ప్రజలు, కార్మికులపై ఎల్లవేళలా ఉండాలని కోరారు.