
గోదావరిఖని, వెలుగు: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. మంగళవారం గోదావరిఖనిలోని ప్రధాన మార్కెట్లక్ష్మీనగర్ ప్రాంతంలో రూ.29.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లక్ష్మీనగర్ మార్కెట్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యాక ఎవరైనా రోడ్లను పగలగొడతే రూ.5లక్షల ఫైన్ వేయాలని మున్సిపల్ ఆఫీసర్లకు సూచించారు.