పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయం : రాజ్​ఠాకూర్​

పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయం : రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్​గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయమని, ఎంపీగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తాడని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌ రాజ్‌‌ఠాకూర్​ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పాలకుర్తి, బసంత్​ నగర్​ ప్రాంతాలలో ఉపాధి కూలీలను, ప్రజలను కలిసి మే 13న జరిగే పోలింగ్​లో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్​ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు.

నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి లిఫ్ట్‌‌​, పత్తిపాక రిజర్వాయర్​, కుక్కలగూడూరు బండలవాగు ప్రాజెక్ట్​ను రూ.350 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్​, లీడర్లు మహాంకాళి స్వామి, రైతులు పాల్గొన్నారు. అనంతరం గోదావరిఖనిలో స్వర్ణకార సంఘం, దోబీఘాట్​ రజకులతో, ఎల్‌‌బీ నగర్, అశోక్​నగర్​, స్వతంత్ర చౌక్​ ఏరియాలలో​ జరిగిన కార్నర్​ మీటింగుల్లో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. 

జ్యోతినగర్, వెలుగు:  కార్పొరేట్‌‌ షాపుల వల్ల తమ కులవృత్తులకు ముప్పు పొంచి ఉందని, ఆ షాపులకు పర్మిషన్​ ఇవ్వొద్దని ఎన్టీపీసీ నాయీబ్రహ్మణ సేవా సంఘం లీడర్లు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకుడు కంది చంద్రయ్య, సంఘం  నాయకులు పాల్గొన్నారు.