పవర్​ ప్లాంట్​ పనులను ప్రారంభించండి.. సీఎంను కోరిన రామగుండం ఎమ్మెల్యే 

పవర్​ ప్లాంట్​ పనులను ప్రారంభించండి.. సీఎంను కోరిన రామగుండం ఎమ్మెల్యే 

గోదావరిఖని, వెలుగు: రామగుండం పట్టణంలోని జెన్​కో స్థలంలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్​క్రిటికల్​పవర్ ప్లాంట్​పనులను ప్రారంభించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్​సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎంను కలిసిన ఎమ్మెల్యే.. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

రామగుండంలో మూసివేసిన 62.5 మెగావాట్ల ప్లాంట్​స్థానంలో 800 మెగావాట్ల ప్లాంట్​ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఆ పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.