రుడా ఏర్పాటుకు జీవో విడుదల..198 గ్రామాలు విలీనం ప్రతిపాదన

రుడా ఏర్పాటుకు జీవో విడుదల..198 గ్రామాలు విలీనం  ప్రతిపాదన

పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను రామగుండం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (RUDA) గా మారనుంది. ఇందుకోసం  జీవో 165 జారీ చేశారు మున్సి పల్ కార్యదర్శి దాన కిషోర్. 

రామగుండం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(RUDA)లోకి రామగుండం  నగరపాలక సంస్థలతోపాటు, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలను తీసు కొచ్చారు. రుడా పరిదిలో 198 గ్రామాలను  తీసుకువచ్చారు. 

రుడా ఏర్పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశముంది. పట్టణీకరణ పెరుగుతుంది. రుడాతో గ్రామాల అభివృద్ది జరుగనుంది. అభివృద్ధి చేసుకోవ డానికి నిధుల కొరత ఉండదు. రుడా పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాలకు దీని నిధులు కేటాయించుకోవచ్చు.

ALSO READ | రోడ్లకు ఫారెస్ట్ పర్మిషన్లు ఐదేండ్లుగా పెండింగ్