గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎన్టీపీసీ మూడు ఎనర్జీ కంపెనీ అవార్డులను దక్కించుకుంది. న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ఎనర్జీ లీడర్షిప్అవార్డుల ప్రోగ్రామ్ లో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కేదార్రంజన్పాండుకు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి, మాజీ పవర్ సెక్రటరీ అనిల్ రజ్దాన్ అవార్డులను అందజేశారు.
‘ఎనర్జీ కంపెనీ అవార్డు- ఆఫ్ ఇండస్ట్రీస్, ఎనర్జీ కంపెనీ అవార్డు -ఆఫ్ పవర్, ఎనర్జీ కంపెనీ అవార్డు రినోవబుల్’ విభాగాల్లో అవార్డులు లభించాయి. కాగా రామగుండం ఎన్టీపీసీకి అవార్డులు రావడంపై స్థానికంగా అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.