కాకా స్మారక టోర్నీలో రామగుండం, పెద్దపల్లి విక్టరీ

కాకా స్మారక టోర్నీలో రామగుండం, పెద్దపల్లి విక్టరీ

కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ​సింగరేణి ఠాగూర్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో బుధవారం జరిగిన కాకా వెంకటస్వామి స్మారక పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ స్థాయి క్రికెట్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో రామగుండం, పెద్దపల్లి టీమ్స్‌‌‌‌‌‌‌‌ విజయం సాధించాయి. ఉదయం రామగుండం, బెల్లంపల్లి నియోజకవర్గ జట్ల మధ్య పోటీ జరిగింది. బెల్లంపల్లి టీం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 రన్స్‌‌‌‌‌‌‌‌ చేయగా, ఎల్​.శివ 34 పరుగులు సాధించాడు. 

అనంతరం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన రామగుండం జట్టు 18.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 149 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసి విజయం సాధించింది. జట్టు ప్లేయర్​ఎం.నరేందర్​16 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 36 రన్స్​చేసి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌‌‌‌‌గా ఎంంపికయ్యాడు. జి.కన్నా 33, మనోహర్​29 రన్స్​ చేశారు. మందమర్రి బ్లాక్​కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ గోపతి రాజయ్య, జంగపెల్లి మల్లయ్య, పలిగిరి కనకరాజు, నిర్వాహకుడు బింగి దుర్గాప్రసాద్‌‌‌‌‌‌‌‌ పోటీలను ప్రారంభించి, ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు అందజేశారు.

రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పెద్దపల్లి టీం విక్టరీ

మధ్యాహ్నం పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గ జట్ల మధ్య రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన ధర్మపురి నియోజకవర్గ జట్లు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన పెద్దపల్లి జట్టు 15.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 128 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టుకు చెందిన ప్లేయర్​జునాయడ్​30 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 43 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసి చేసి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్నాడు.