మంచిర్యాల/భైంసా, వెలుగు: రక్తదానం మహా దానమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వారి త్యాగాలను స్మరిస్తూ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బుదవారం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించి మాట్లాడారు. అమరుల త్యాగ ఫలంగానే నేత దేశ, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా ఉన్నారని అన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, సీఐలు ప్రమోద్ రావు, అశోక్ కుమార్, నరేందర్, రెడ్ క్రాస్ అసోసియేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సెక్రటరీ మహేందర్, సబ్ డివిజన్ ఎస్సైలు, పోలీస్ సిబంది పాల్గొన్నారు.
భైంసాలో..
పోలీసు శాఖ ఆధ్వర్యంలో భైంసాలోని ఏరియా హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, టౌన్‌సీఐ గోపీనాథ్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. అపోహలు వీడి అర్హులందరూ రక్తదానం చేసేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.కాశీనాథ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండేప్ కాశీనాథ్, డాక్టర్ అనిల్ జాదవ్ తదితరులున్నారు.