ర్యాగింగ్​, ఈవ్​టీజింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు : సీపీ ఎం.శ్రీనివాసులు

  •  స్టూడెంట్లు తమ భవిష్యత్​ను నాశనం చేసుకోవద్దు

గోదావరిఖని, వెలుగు : స్టూడెంట్లు ర్యాగింగ్​, ఈవ్​ టీజింగ్​కు పాల్పడి తమ   భవిష్యత్​ను నాశనం చేసుకోవద్దని రామగుండం పోలీస్​ కమిషనర్​ ఎం.శ్రీనివాసులు హెచ్చరించారు. రామగుండం మెడికల్​ కాలేజీలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్​కు పాల్పడిన ఘటన నేపథ్యంలో గురువారం కాలేజీ లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 'ర్యాగింగ్​ నేరం' అనే   పోస్టర్​ ఆవిష్కరించి స్టూడెంట్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ విద్యార్థులకు కాలేజీ క్యాంపస్​ జీవితం కీలకమని, వారు ఉన్నతంగా చదవడానికి, ఎదగడానికి దానిని ఉపయోగించుకోవాలన్నారు.

సీనియర్లు జూనియర్ విద్యార్థులకు గైడ్ లాగా బ్రదర్​ లాగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్ రహిత క్యాంపస్  ‌‌ ‌‌గా మార్చడానికి విద్యార్థులు కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో ఎవరైనా ర్యాగింగ్, ఈవ్​ టీజింగ్​ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలేజీలో స్పెషల్​ పోలీస్​ టీమ్​ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

కాగా రాబోయే రోజుల్లో రామగుండం కమిషనరేట్​ ఆధ్వర్యంలో అన్ని విద్యా సంస్థలలో ర్యాగింగ్​ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ డాక్టర్​ ఎం.చేతన, కాలేజీ ప్రిన్సిపాల్​ డాక్టర్​ హిమబిందు సింగ్​, పెద్దపల్లి కోర్టు పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ ఎం.జ్యోతి, లీగల్​ ఎయిడ్​ కౌన్సిల్​ మెంబర్​ నుచ్చు శ్రీనివాస్​, సీడీపీఓ కమాలాకర్​, ఇన్స్​పెక్టర్లు ప్రమోద్​రావు, ప్రవీణ్​కుమార్​, పాల్గొన్నారు.