మంచిర్యాల, వెలుగు: తాళం వేసిన ఇండ్లలో దొంగలు పడకుండా ఉండాలంటే డోర్ అలారం ఏర్పాటు చేసుకోవాలని, ఆ సౌండ్‌కు దొంగలు భయంతో పారిపోతారని రామగుండం పోలీస్‌కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. యాంటీ థెఫ్ట్అలారం లాక్, స్మార్ట్ సెన్సార్ అండ్ మాగ్నెటిక్ యాంటీ థెఫ్ట్ అలారం గురించి శనివారం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఇటీవల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి లాక్స్ వినియోగించడం ద్వారా చోరీలు అదుపు చేయవచ్చని అన్నారు. దీని బజర్ ఏకంగా 105 నుంచి 110 వరకు డీబీతో మోగుతుందని, చాలా దూరం వరకు సౌండ్ స్పష్టంగా వినిపిస్తుందని తెలిపారు. ఎవరైనా ఇంట్లో చొరబడానికి ప్రయత్నిస్తే అలారం మోగడం వల్ల చుట్టపక్కల వారు అలర్ట్అవుతారని, చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి భయపడి పారిపోతాడని అన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ కామర్స్ సైట్స్‌లో యాంటీ థెఫ్ట్ అలారాలు రూ.300 నుంచి రూ.500 లకే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.