
- మంచిర్యాల జిల్లా కర్ణపేటలో మెగా హెల్త్ క్యాంప్
- బ్లాంకెట్లు, చీరలు, బుక్స్ పంపిణీ
మంచిర్యాల, వెలుగు : ఆదివాసీలకు నిత్యం అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. లక్సెట్టిపేట సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్ణపేటలోని రైతు వేదిక వద్ద ఆదివాసీలకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. లోకల్బాడీస్ అడిషనల్కలెక్టర్ బి.రాహుల్, డీసీపీ సుధీర్ కేకన్ రాంనాథ్తో కలిసి సీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గవర్నమెంట్, ప్రైవేట్ డాక్టర్ల ఆధ్వర్యంలో మండలంలోని 31 తండాలకు చెందిన సుమారు 1100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రజలకు ఎంతో దగ్గరయ్యిందన్నారు.
రెవెన్యూ అంశాలు, సమస్యలపై ఆదివాసీలకు అడిషనల్ కలెక్టర్ అవగాహన కల్పించారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతీ యువకులకు పోలీసులు కాంపిటేటివ్ బుక్స్ అందజేశారు. వెయ్యి మందికి బ్లాంకెట్లు, 250 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎంవీఐ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో 250 మందికి డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్ హుల్ హక్, మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్ ఏసీపీ మల్లికార్జున్, లక్సెట్టిపేట, మంచిర్యాల రూరల్ సీఐలు కృష్ణ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.