దసరా వేడుకలకు కార్పొరేటర్ల డుమ్మా

దసరా వేడుకలకు కార్పొరేటర్ల డుమ్మా
  • రామగుండం టీఆర్​ఎస్​లో ముసలం
  • దసరా వేడుకలకు కార్పొరేటర్ల డుమ్మా
  • డివిజన్లలో అభివృద్ధి పనులు జరగడం లేదని అలక
  • కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 మంది రహస్య సమావేశం


గోదావరిఖని, వెలుగు :  రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. బుధవారం రాత్రి సింగరేణి స్టేడియంలో జరిగిన దసరా వేడుకలకు గైర్హాజరు కాగా.. గురువారం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 మంది కార్పొరేటర్లు రహస్య సమావేశం నిర్వహించారు. తమ డివిజన్లలో అభివృద్ధి పనులు చేయడం లేదని, అసలు పట్టించుకోవడం లేదని వారు అలిగారు. కొంత కాలంగా రామగుండం మేయర్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పలువురు కార్పొరేటర్లకు మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. 

నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులపై నిరసన..

ఎవరితో చర్చించకుండానే మేయర్​ కార్పొరేషన్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం, తమకు తెలియకుండా సుమారు రూ.3 కోట్ల విలువైన నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించి బిల్లులను ఎజెండాలో చేర్చడం, పలు డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్ల ఏర్పాట్ల విషయంలో అసలు పట్టించుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ రామగుండం కార్పొరేషన్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికార పార్టీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. చివరకు ఈ అంశాలను పక్కన పెడతామని మేయర్​ హామీ ఇవ్వడంతో కార్పొరేటర్లు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. కరోనాతో ఒక సంవత్సరం ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, గత రెండేండ్లలో కూడా డివిజన్లలో సరైన అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలంతా తమను నిలదీస్తున్నారని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన 11 మంది కార్పొరేటర్లు గురువారం కార్పొరేషన్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రహస్య మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసుకున్నారు.

దళితబంధు స్కీంపై అసంతృప్తి..

దళితబంధు స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనీసం కార్పొరేటర్లను సంప్రదించకుండానే తమకు నచ్చిన వారికి కేటాయిస్తున్నారని, దీనివల్ల డివిజన్లలో తమకు విలువ ఎక్కడుంటుందని ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్పొరేటర్లు చర్చించుకున్నట్లు తెలిసింది. ఇదే విషయమై ఇటీవల 25 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గానికి మొదటి విడతగా మంజూరు కానున్న 500 దళిత బంధు యూనిట్లలో ప్రతి డివిజన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌కు ఆరుగురికి ఇవ్వాలని కార్పొరేటర్లు కోరారు. దీనిపై ఎమ్మెల్యే నుంచి స్పందన రాలేదు. కార్పొరేషన్ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌, ఆఫీసర్ల తీరుతో తమ ఆత్మాభిమానం దెబ్బతింటుందని కార్పొరేటర్లు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చించినట్టు సమాచారం. మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వారి కార్పొరేటర్ల డివిజన్లకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని, తమను అసలు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందినట్టు తెలిసింది. కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆఫీసర్లు కూడా ప్రోటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించలేదని, కనీస విలువ ఇవ్వక అవమానిస్తున్నా మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పందించడం లేదని చర్చించినట్టు సమాచారం. త్వరలో మంత్రులను కలిసి ఈ విషయాలను వారికి వివరిస్తామని పలువురు అసంతృప్త కార్పొరేటర్లు తెలిపారు.