- పోటెత్తిన భక్తజనం
భద్రాచలం,వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో సోమవారం భక్తులకు రామయ్య నిజరూప దర్శనం ఇచ్చారు. గర్భగుడిలో ముందుగా స్వామికి ముత్యాల వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవ నిర్వహించారు. స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి రామావతారంలో స్వామిని అలంకరించారు. సాయంకాల ఆరాధనలు జరిగాయి.
ఈనెల 9న సాయంత్రం గోదావరిలో హంసావాహనంపై సీతారాములకు తెప్పోత్సవం, 10న తెల్లవారుఝామున వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం ఉన్నందున లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. 2లక్షల లడ్డూలను అదనంగా తయారు చేసి సిద్ధంగా ఉంచుతున్నారు.