చలువ చప్పర వాహనంపై ఊరేగిన రామయ్య

శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చలువ చప్పర వాహనంపై ఊరేగారు. ఉదయం యాగశాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. చతుస్థానార్చనలు చేశారు. సాయంత్రం రాజవీధి గుండా గోవిందరాజస్వామి ఆలయం వరకు చలువ చప్పర వాహనంపై స్వామి తిరువీధి సేవకు వెళ్లారు. దారిపొడవునా భక్తులు స్వామిని మంగళనీరాజనాలు పలికారు.
- భద్రాచలం, వెలుగు