
గజ్వేల్, వెలుగు : రిపబ్లిక్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన కళాకారుడు, రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు 33వేల నాణేలతో మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించారు. ఈ జెండాను 3 రోజులు శ్రమించి 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో చిత్రించి తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవభక్తి ముఖ్యమేనని, కానీ అంతకు మించి ముందు దేశభక్తి ముఖ్యమన్నారు. గత 30 ఏండ్ల నుంచి భారతదేశ చిత్ర పాఠాలు, జాతీయ జెండాలు చిత్రించానని చెప్పారు. భవిష్యత్తులోనూ చిత్రీకరణ కొనసాగిస్తానని రామరాజు పేర్కొన్నారు.