లింగంపేట,వెలుగు: బీఆర్ఎస్ సెన్సార్ బోర్డ్మెంబర్, లింగంపేట మండలం సురాయిపల్లికి చెందిన అతిమాముల రామకృష్ణ గుప్తా ఆదివారం హైదరాబాద్లో కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.రామకృష్ణ శనివారం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
రామకృష్ణ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ విజయానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.