- ఫేజ్–2 పర్మిషన్లు పొందడంలో సింగరేణి లేట్
- అటవీ అనుమతులు వస్తేనే ఓసీపీ మనుగడ
- డిసెంబర్ చివరాఖరుకు మాత్రమే బొగ్గు ఉత్పత్తి
కోల్‌బెల్ట్, వెలుగు : రామకృష్ణాపూర్ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్(ఓసీపీ) భవిష్యత్ప్రశ్నార్థకంగా మారింది. మంచిర్యాల జిల్లాలోని ప్రాజెక్టు విస్తరణ కోసం భూ సేకరణ లేట్ అవుతుండగా గని మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి. రెండో ఫేజ్‌లో సేకరించాల్సిన భూములు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పర్మిషన్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
బొగ్గు వెలికితీతకు అవసరమైన భూములు లేకపోగా డిసెంబర్నెలాఖరు నాటికి బొగ్గు ఉత్పత్తి పూర్తి చేసి జనవరిలో ఓసీపీని మూసివేయాలని ఇప్పటికే సింగరేణి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు ఓబీ కాంట్రాక్ట్సంస్థ తన ఓవర్‌బర్డెన్ కార్యకలాపాలను కూడా 90 శాతం తగ్గించింది. గనిలో మరో నెల రోజులకు మాత్రమే వెలికితీసేంత సుమారు10 లక్షల టన్నులకు పైగా బొగ్గు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. అయితే.. ప్రస్తుత ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ అక్టోబర్ నాటికే పనులను నిలిపివేసింది.
- పదకొండేండ్ల కిందట..
సింగరేణిలో ఓపెన్కాస్ట్మైన్లేని ఏకైక ఏరియాగా 2013 వరకు మందమర్రి ఉంది. అంతకు ముందు మూతపడ్డ ఆర్కే-–4 గనిలో మిగిలిన బొగ్గును వెలికితీసేందుకు రామకృష్ణాపూర్ఓసీపీ పేరిట గనిని ఏర్పాటు చేశారు. 2014 ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించారు. బొగ్గు అధిక ఉత్పత్తితో మందమర్రి ఏరియాకు ఆర్కేపీ ఓసీపీ మణిహారమైం ది.
సగటున 3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి ఏటా రికార్డు స్థాయిలో 22 లక్షల టన్నులను సాధించిన ఘనత దక్కించుకుంది.సేఫ్టీలోనూ జాతీయస్థాయి అవార్డులు సాధించింది. గత11 ఏండ్లలో 2.11 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని టార్గెట్‌గా పెట్టుకోగా.. 2024 –-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1. 60 కోట్ల టన్నులు వెలికితీశారు. సుమారు 76 శాతం టార్గెట్ పూర్తి చేశారు.
- రామకృష్ణాపూర్ అస్థిత్వంపై ప్రభావం
పది నుంచి పదిహేను అండర్ గ్రౌండ్బొగ్గు గనులు, ఏరియా జీఎం ఆఫీస్, ఇతర డిపార్ట్మెంట్లతో ఉన్న రామకృష్ణాపూర్పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. వరుసగా ఇక్కడ ఉన్న గనులు, డిపార్ట్మెంట్లను మూసివేసింది. ఆర్కే1ఏ, ఆర్కేపీ ఓసీపీ గనులుండగా ఏడాదిన్నర కిందట ఆర్కే1ఏ గనిని మూసివేసింది. తాజాగా మరో నెలలో ఓపెన్కాస్ట్గని సైతం మూతపడనుంది. దీంతో ఆర్కేపీ బొగ్గు క్షేత్రంతో కార్మికులకు బంధం ముగియనుంది.
ఇప్పటికే గనుల మూసివేతతో వందలాది కుటుంబాలు వేరే ప్రాంతాలకు వెళ్లాయి. మరోవైపు ఓసీపీలో ప్రస్తుతం సుమారు 250 మంది కార్మికులు పనిచేస్తుండగా .. ఇందులో మెజార్టీ సీనియర్కార్మికులు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారు. గని మూసివేయడంతో వారంతా ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
- రెండో ఫేజ్ విస్తరణతోనే మనుగడ
రామకృష్ణాపూర్ఓసీపీఫేజ్–1 పర్మిషన్లు వచ్చే ఏడాది జూన్వరకు ఉండగా.. ఫేజ్–2 పర్మిషన్లకు సరైన ప్రణాళిక లేదు. దీంతో డిసెంబర్నెలఖారునాటికి గని మూసివేసే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మూసివేసిన ఆర్కే1,1ఏ, 2,3 ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు 375 హెక్టార్ల ఫారెస్ట్ భూమి, 600 హెక్టార్ల నాన్‌ఫారెస్ట్ ల్యాండ్ సేకరించాల్సి ఉంది. ఆయా భూముల్లో సుమారు 25 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా మరో 12 నుంచి 14 ఏళ్ల వరకు గనిలో మైనింగ్ తవ్వకాలు చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర ఫారెస్టీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ల నుంచి అటవీ భూముల సేకరణకు పర్మిషన్ రావాల్సి ఉంది.
- రెండో ఫేజ్ పర్మిషన్లు త్వరగా వచ్చేలా చొరవ చూపాలి
ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్‌కు అవసరమైన భూసేకరణ పర్మిషన్లు తొందరగా వచ్చేలా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ఓసీపీ మూసివేస్తే సీనియర్కార్మికులు, రిటైర్మెంట్కు దగ్గర ఉన్న కార్మికులు ఇబ్బందులు పడతారు. మరోవైపు పట్టణ మనుగడకు కూడా విఘాతం కలుగుతుంది.
- చెప్యాల రమేశ్, ఐఎన్టీయూసీ సెక్రటరీ