బెల్లంపల్లిలో అక్టోబర్ 13 నుంచి 16 వరకు జోనల్ క్రీడాపోటీలు

బెల్లంపల్లి, వెలుగు: సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ)లో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు గురుకుల జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరుగుతాయని సంక్షేమ గురుకుల స్పోర్ట్స్ ఆఫీసర్ డా.జె.రామలక్ష్మణ్ తెలిపారు. 

మంగళవారం ఆయన సీఓఈను సందర్శించి క్రీడలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి గేమ్స్ మీట్ ఓవరాల్ ఇన్​చార్జ్ ప్రసాద్, జిల్లా సమన్వయ అధికారి కొప్పుల స్వరూపరాణి, ప్రిన్సిపాల్ ఐనాల సైదులును అడిగి తెలుసుకున్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో కబడ్డీ, ఫుట్​బాల్, హ్యాండ్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, ఖోఖో, చెస్, క్యారమ్స్, రన్నింగ్, షాట్ పుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, హై జంప్ వంటి క్రీడలు నాలుగు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. గురుకులాల ప్రిన్సిపాల్స్ ఊటూరి సంతోష్, ఎస్.స్వరూప పాల్గొన్నారు.