రామలింగేశ్వర కల్యాణ మహోత్సవాన్ని సక్సెస్​ చేయాలి

కామేపల్లి, వెలుగు :  మండలంలోని పండితాపురంలో ఈనెల 19 నుంచి 22 వరకు జరిగే పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, జాతరను సక్సెస్​ చేయాలని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ అడ్వకేట్ బోడేపూడి విఠల్ రావు  కోరారు. ఆదివారం వారు ఆలయం వద్ద జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్లు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. వారి వెంట కొండాయిగూడెం మత్స్య శాఖ అధ్యక్షుడు మేకల మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ గిరిజన జిల్లా నాయకులు ఉన్నారు.