OTT Thriller: అఫీషియల్.. ఓటీటీలోకి రీసెంట్ తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

OTT Thriller: అఫీషియల్.. ఓటీటీలోకి రీసెంట్ తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

నటులు ధనరాజ్, సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రామం రాఘవం'(Ramam Raghavam). ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల రాసిన కథ ఇది. ధనరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైంది. తండ్రీ కొడుకుల ఎమోషనల్ జర్నీగా వచ్చిన ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్కు డేట్ని సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది.

రామం రాఘవం ఓటీటీ:

"తండ్రీ కొడుకుల ప్రయాణం మీరు ఊహించని రీతిలో సాగుతుంది.. మార్చి 14 నుండి సన్ నెక్ట్స్ లో ప్రసారమయ్యే రామం రాఘవను చూడండి" అంటూ ఓటీటీ సంస్థ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే, ఈ మూవీ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్లో రానుంది. మొదట ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ఈటీవీ విన్ అనౌన్స్ చేసింది, కానీ, త్వరలో ప్రీమియర్ డేట్ వెల్లడిస్తాం అంటూ తెలిపింది.

ఇక లేటెస్ట్గా సన్ నెక్ట్స్ ఓటీటీ డైరెక్ట్గా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇక త్వరలో ఈటీవీ విన్ ప్రీమియర్ డేట్ వెల్లడించే అవకాశం ఉంది. ఈ మూవీలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వి,  శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు ననటించారు. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల అయింది. నిజాయితీప‌రుడైన తండ్రి...అడ్డ‌దారుల్లో ప‌య‌నించే కొడుకు.. వారిద్ద‌రి మ‌ధ్య విద్వేషాలు, విభేదాలు ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీసాయ‌న్న‌దే రామం రాఘ‌వం మూవీ క‌థ‌. 

కథేంటంటే:

సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం (సముద్రఖని) చాలా నిజాయితీపరుడు. తన కొడుకు రాఘవ (ధన్‌రాజ్‌) అంటే చాలా ప్రేమ. కొడుకుని ఎంతో గారాబంగా పెంచుతాడు. ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుక్షణం తపిస్తుంటాడు. అందుకు డాక్టర్‌ని చేయాలని కలలు కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేసి జులాయిగా తిరుగుతాడు. మద్యం, సిగరేట్లు తాగుతూ జీవితాన్ని పాడుచేసుకుంటాడు. ఈజీ మనీ కోసం ఎదురొచ్చిన అడ్డదారులన్ని తొక్కుతాడు.

అందులో భాగంగా అనేక తప్పులు చేస్తుంటాడు. ఓ సారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రే అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాక తండ్రినే చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్‌ దేవ (హరీస్‌ ఉత్తమన్‌)తో హత్యకు డీల్‌ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్‌ చేసుకున్న డీల్‌ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే రామం రాఘవం సినిమా చూడాల్సిందే.