- ప్రధాన కార్యదర్శిగా సురేందర్ రెడ్డి
- 81 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు
గోదావరిఖని, వెలుగు : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీని శనివారం గోదావరిఖనిలోని సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన మీటింగ్‌లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రకటించారు. మొత్తం 81 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. యూనియన్సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాదాసి రామమూర్తి, జనరల్ సెక్రటరీగా కె.సురేందర్ రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా నూనె కొమురయ్య, ఉపాధ్యక్షులుగా బడికల సంపత్ కుమార్, ధరావత్ మంగీలాల్, జంగిలి రవీందర్, నల్లవెల్లి సదానందం, కుశన వీరభద్రం, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధిగా పర్లపల్లి రవి, ట్రెజరర్‌గా ఎల్.వెంకటేశ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా ఎండీ జాహిద్ పాషా, బండి రమేశ్, ఓ.రాజశేఖర్, ఎస్.రంగనాథ్, పింగిళి సంపత్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా చెల్పూరి సతీశ్, పానుగంటి సత్తయ్య, బేతి చంద్రయ్య, సిద్ధంశెట్టి సాజన్, దాసరి శ్రీనివాస్, వసికర్ల కిరణ్‌కుమార్, రత్నం అవినాష్, ఇ.ప్రవీణ్ కుమార్‌తో పాటు ఆర్గనైజింగ్సెక్రెటరీలు, 11 డివిజన్ల ఉపాధ్యక్షులను ప్రకటించారు. మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వమని, ఇందుకోసం కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని ప్రకటించారు.