కులగణనపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి : రామన్​ గౌడ్

కులగణనపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి : రామన్​ గౌడ్

పెబ్బేరు, వెలుగు: కుల గణనపై స్పష్టమైన విధివిధానాలు రూపొందించేలా బీసీ కమిషన్​కు తమ అభిప్రాయాలను తెలియజేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్​ గౌడ్​ కోరారు. ఆదివారం పెబ్బేరులో మీడియాతో మాట్లాడుతూ బీసీ కమిషన్​ చైర్మన్​ నిరంజన్​ ఆధ్వర్యంలో ఈ నెల 8న మహబూబ్​నగర్​లో  అభిప్రాయ సేకరణ జరుగుతుందని, ఈ సమావేశానికి బీసీ సంఘాల నాయకులు పాల్గొని స్పష్టమైన వైఖరిని తెలియజేయాలన్నారు. 

బీసీలకు జరుగుతున్న అన్యాయం, తదితర అంశాలపై వినతిపత్రాలు అందించాలన్నారు. రాష్ట్రంలోని బీసీ కులాలు అప్రమత్తంగా ఉంటూ హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన చేపట్టి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బహుజనులకు నష్టం కలిగించే జీవో 29ని, ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని డిమాండ్  చేశారు. బాలరాజు, బాలస్వామి, శంకర్​ నాయుడు, వడ్డే రమేశ్, పరమేశ్, సుభాశ్, రాజు, బస్వరాజ్​ గౌడ్​, తిరుపతయ్య పాల్గొన్నారు.