
ఐపీఎల్ 2025 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచి రెండు మ్యాచ్ లో ఓడిపోయింది. ఓడిన రెండు మ్యాచ్ లు కూడా భారీ పరాజయాలే కావడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. ముఖ్యంగా సోమవారం (మార్చి 31) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరమైన ఓటమిని మూట గట్టుకుంది. 116 పరుగులకే కుప్పకూలింది. జట్టులో చివరి వరకు హిట్టర్లు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా బాధ్యతగా ఆడలేదు. ప్రతి ఒక్కరూ చెత్త షాట్ ఆడుతూ వికెట్లను సమర్పించుకున్నారు.
కోల్‌కతా ప్రదర్శనపై ఆ జట్టు ఆల్ రౌండర్ రమణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. " జట్టు ఇన్నింగ్స్ ను ఆరంభించాలని ఉంది. జట్టు నన్ను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా దానికి సిద్ధం. మెగా వేలం ఖచ్చితంగా నిరాశపరిచేది. మీకు కాంబినేషన్ సెట్ అయ్యాక ప్రతి మూడు సంవత్సరాలకు మీరు జట్టును మార్చాలి. ఈ సందర్భాల్లో జట్టు త్వరగా విన్నింగ్ కాంబినేషన్ సెట్ చేయడం కష్టంతో కూడుకున్నది. ప్రస్తుతం మేము మా విన్నింగ్ కాంబినేషన్ సెట్ చేసుకొని విజయాన్ని సాధించే పనిలో ఉన్నాము. అని రమణ్ దీప్ మ్యాచ్ తర్వాత అన్నాడు.
KKR all-rounder Ramandeep Singh has his say on the challenges faced by teams post the mega auction.#IPL2025 #MIvKKR #IPL #KKR pic.twitter.com/gLlXqSpuGH
— Circle of Cricket (@circleofcricket) April 1, 2025
2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు రమణ్ దీప్ సింగ్ ను రూ. 4 కోట్ల రూపాయలకు ఆ జట్టు రిటైన్ చేసుకుంది. లోయర్ ఆర్డర్ లో ఇన్నింగ్స్ ఫినిష్ చేసే బాధ్యతను తీసుకున్నాడు. రెండు మ్యాచ్ ల్లో ఈ కేకేఆర్ ఆల్ రౌండర్ 28 పరుగులు చేశాడు. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్ లో 8 వ స్థానంలో.. ముంబై తో సోమవారం (మార్చి 31) జరిగిన మ్యాచ్ లో 9 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ మ్యాచ్ లో 12 బంతుల్లోనే 22 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
ALSO READ : Dwayne Bravo: జట్టును నిలబెట్టినా అతన్ని ఎందుకు తప్పించారు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై బ్రావో ఫైర్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (4/24) అద్భుత బౌలింగ్‌తో విజృంభించడంతో ఐపీఎల్18లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ని 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే అయింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది.