రామప్ప గొప్ప కట్టడం: యునెస్కో టీం

  • కొనియాడిన యునెస్కో ప్రతినిధి పోశ్యానందన
  •  ఆలయాలు పరిశీలించిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రెండు రోజుల పర్యటన పూర్తి
  • యునెస్కో గుర్తింపు విషయంలో మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి
  • ఐదారు నెలల్లో రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రామప్ప దేవాలయం ఎంతో గొప్ప కట్టడమని యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన అన్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో యునెస్కో ప్రతినిధుల బృందం రెండు రోజుల పర్యటన గురువారం ముగిసింది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు విషయంలో మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యింది. ఈ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే నివేదిక ఆధారంగానే యునెస్కో గుర్తింపు వస్తోంది. రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తికావడానికి ఐదారు నెలల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడుతోంది. గురువారం ఉదయ 10.30 గంటలకు రామప్ప వచ్చిన వాసు పోశ్యానందన మధ్యాహ్నం 3 గంటల వరకు రామప్ప అనుబంధ దేవాలయాలను, రామప్ప సరస్సు, కాలువలు, రోడ్డు మార్గం పరిశీలించారు. సరస్సులో బోటు షికారు చేశారు. పాలంపేట గ్రామస్తులతో చాలా సేపు ముచ్చటించారు.

పత్రాల ఆధారంగా పరిశీలన

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోరుతూ పంపించిన పత్రాల ఆధారంగా వాసు పోశ్యానందన రెండో రోజు పరిశీలన జరిపారు. ఇంటాక్  కన్వీనర్ పాండు రంగారావు, రిటైర్డ్ ఐఏఎస్ పాపారావు సలహాలు సూచనలు ఆధారంగా రామప్ప ఆలయం, అనుబంధ ఆలయాలు కలియ తిరుగుతూ అనువణువును క్షుణ్నంగా పరిశీలించారు. సమర్పించిన పత్రాల ప్రకారం శిల్పకళా సంపద ఉందో.. లేదో గమనించారు. ముందుగా ఆలయ సమీపంలోని కెనాల్ కాలువలను పరిశీలించారు. గార్డెన్లో జరుగుతున్న పనులను, ఉప ఆలయాలు సందర్శించి వాటి పురోగతిపై చర్చించారు. గుల్లాల గుడి, కాంపౌండ్ వాల్, బోటింగ్ పాయింట్, త్రికూట ఆలయం తదితర వాటిని సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు.

స్థానికులతో మాటాముచ్చట

పాలంపేట వాసులో పోశ్యనందన అరగంట పాటు మాట్లాడారు. యునెస్కో గుర్తింపు వస్తే కలిగే లాభాల గురించి వివరించారు. ఆయన చెప్పిన విషయాలు రామప్ప గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలుగులోకి అనువాదం చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి అవసరమైన భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని గ్రామస్తులు ప్రకటించారు.

యునెస్కో గుర్తింపుపై పెరుగుతున్న ఆశలు

రామప్ప దేవాలయానికి ఈసారి ఎలాగైనా యునెస్కో గుర్తింపు వస్తుందని ఇంటాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండు రంగారావు ఆశాభావం వ్యక్తం చేశారు. పోశ్యనందన రెండు రోజుల పర్యటనలో పాండు రంగారావు ఆయన వెంటే ఉన్నారు. పోశ్యానందన రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెస్టోరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాలపై మంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని  తెలిపారు. రామప్ప దేవాలయం, వెయ్యి స్తంభాల గుడి రెండు కూడా రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టడాలే కావడం మనకు కలిసివచ్చే అంశమన్నారు. అలాగే రామప్ప కట్టడాలు, శిల్పాలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తే యునెస్కో ప్రతినిథిగా రావడం వల్ల ఈసారి తప్పకుండా యునెస్కో గుర్తింపు వస్తుందని వివరించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సి.నారాయణరెడ్డి, వరల్డ్ హెరిటేజ్ సూపరిడెంట్ మిలన్ కుమార్ చౌలె, బీవీ పాపారావు, హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దినకర్ బాబు, టూరిజం జిల్లా అధికారి శివాజీ, కన్జర్వేషన్  అసిస్టెంట్  మల్లేశం , జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.