ములుగు జిల్లాలో చేపల కోసం జనాల తిప్పలు

ములుగు జిల్లాలో  చేపల కోసం జనాల తిప్పలు

భారీ వర్షాలకు ములుగు జిల్లా వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం పాలంపేటలోని రామప్ప సరస్సు మత్తడి పోయడంతో చేపలు భారీగా బయటకు వచ్చాయి. దీంతో వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ములుగు, గుణపురం మండలాలకు చెందిన వందలాది మంది వలలు, దోమ తెరలతో శుక్రవారం మత్తడి వద్దకు వచ్చి చేపల వేట సాగించారు.

ఒక్కొక్కరు 5 నుంచి 10 కిలోల చేపలు పట్టుకెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 100 క్వింటాళ్ల చేపలను పట్టుకెళ్లినట్లు తెలుస్తోంది. ములుగు, వెంకటాపురం (రామప్ప), వెలుగు