రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటన సందర్భంగా భద్రతా బలగాలు భారీగా మోహరించారు. రామప్ప ఆలయాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో హై అలెర్ట్ చేపట్టారు.
రామప్పకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీలసులు. బస్సు యాత్ర రూట్ పొడవునా నో ఫ్లై జోన్ ప్రకటించారు. ఈరోజు(అక్టోబర్ 18) 30కిలో మీటర్ల మేర రాహుల్ బస్సు యాత్ర ఉండనుంది. అయితే ఈ రూట్ పొడవునా సాయుధ బలగాలు మోహరించారు.
Also Read : TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాం : కేటీఆర్
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత జోరుగా కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజులపాటు కాంగ్రెస్ నేతలు బస్సుయాత్ర చేయనున్నారు. 3 రోజుల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొననున్నారు.
ఇదులో భాగాంగా ఈరోజు 2023 అక్టోబర్ 18న ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం రామానుజపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
షెడ్యూల్..
* అక్టోబర్ 18న ములుగు, భూపాలపల్లిలో పర్యటన
* 19న రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్ లో యాత్ర
* 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ బస్సుయాత్ర
* ఆర్మూర్ లో పసుపు రైతులతో భేటీ కానున్నారు రాహుల్ గాంధీ.