వెంకటాపూర్ లో గుప్త నిధుల కోసం గుడి ధ్వంసం

వెంకటాపూర్ లో గుప్త నిధుల కోసం గుడి ధ్వంసం
  • రామప్ప ఉప ఆలయమైన గొల్లాల గుడి వద్ద ఘటన

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు గుడిని ధ్వంసం చేశారు. ములుగు జిల్లా రామప్ప టెంపుల్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని ఉప ఆలయమైన గొల్లాల గుడి వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం క్లీన్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు గొల్లాల గుడి వద్దకు వెళ్లారు. ఈ టైంలో గుడి పైకప్పు తొలగించి ఉండడంతో వెంటనే ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. 

వారు వచ్చి చూడగా గుడిలోపల శివలింగంతో పాటు శిల్పాలు ధ్వంసమై కనిపించాయి. పైకప్పు తొలగించి నిచ్చెన ద్వారా కిందికి దిగిన దుండగులు గుప్త నిధులు ఉన్నాయన్న అనుమానంతో లింగం, శిల్పాలను ధ్వంసం చేసి ఉంటారని ఆఫీసర్లు తెలిపారు. పురావస్తు శాఖ సిబ్బంది ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జక్కుల సతీశ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.