- సురేందర్ రెడ్డి వారసుడిగా వచ్చి గెలిచిన రఘురాంరెడ్డి
ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన రామసహాయం రఘురాంరెడ్డి పాలిటిక్స్ లో లేట్ గా ఎంట్రీ ఇచ్చినా బంపర్ విక్టరీ కొట్టారు. నామినేషన్ల గడువు ముగింపు దశకు వచ్చిన టైంలో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న ఆయన ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. ఎంపీ టికెట్ కోసం ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులు పోటీ పడడంతో కొద్ది రోజుల పాటు అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది.
అప్పుడే కాంగ్రెస్ సీనియర్ లీడర్ రామసహాయం సురేందర్ రెడ్డి వారసుడిగా రఘురాంరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రామసహాయం సురేందర్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బంధుత్వం కూడా రఘురాంరెడ్డికి కలిసి వచ్చింది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్చార్జీగా పొంగులేటి ఉండడంతో బాధ్యత తీసుకుని రఘురాం రెడ్డిని గెలిపించుకున్నారు.