
వాషింగ్టన్: ట్రంప్ నియమించిన ఎఫిషియెన్సీ కమిషన్ నుంచి ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తప్పుకోనున్నారు. వచ్చే ఏడాది ఓహియో గవర్నర్ పదవి ఖాళీ కానుంది. ఆ పదవి కోసం రామస్వామి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎఫిషియన్సీ కమిషన్ లో ఆయన ఉండరని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.