బైపాస్​ రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. రామాయంపేట పట్టణ బంద్

బైపాస్​ రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. రామాయంపేట పట్టణ బంద్

రామాయంపేట, వెలుగు: బైపాస్​ రోడ్డు నిర్మాణాన్నివ్యతిరేకిస్తూ మంగళవారం రామాయంపేట పట్టణానికి చెందిన భూ నిర్వాసిత రైతులు, ప్రజలు, వ్యాపారులు పట్టణ బంద్​ నిర్వహించారు. స్వచ్ఛందంగా దుఖాణాలు మూసి వ్యాపారులు ఆందోళనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదివరకే నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయామని, మళ్లీ భూములు కోల్పోతే కోలుకోలేని విధంగా నష్టపోతామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు పోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బైపాస్​ రోడ్డు నిర్మిస్తే బిజినెస్​ పూర్తిగా దెబ్బతింటుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బైపాస్ రోడ్డు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు తహసీల్దార్​కు వినతి పత్రం సమర్పించారు.