
- ఫైజాబాద్ లో బీజేపీ అభ్యర్థిని ఓడించడంపై సునీల్ లహరీ ఫైర్
న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మ భూమి ఉన్న ఫైజాబాద్ లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ ను గెలిపించనందుకు అక్కడి ప్రజలు సిగ్గుపడాలని రామానంద్ సాగర్ రామాయణ్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరీ ఫైర్ అయ్యారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించినా.. ఓటర్లు బీజేపీని ఓడించడం సిగ్గుచేటు అని ఆయన ఇన్ స్టాగ్రాం స్టోరీలో పేర్కొన్నారు. అయోధ్య వాసులు తమ రాజుకు ద్రోహం చేశారని అన్నారు.
సీతామాతను అనుమానించింది ఈ అయోధ్య ప్రజలే. ఇప్పుడు కూడా తమ రాజును ఓడించిన స్వార్థపరులుగా నిలిచారు”అని సునీల్ లహరీ విమర్శించారు.