- చైర్మన్ గా తాత్కాలిక బాధ్యతలు అప్పగింత
కామేపల్లి, వెలుగు : కామేపల్లి సొసైటీ వైస్ చైర్మన్ గా పింజరమడుగు గ్రామానికి చెందిన గుజ్జర్లపూడి రాంబాబు ను శుక్రవారం డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో చైర్మన్ గా ఉన్న తీర్థాల చిదంబరరావుపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కాగా అప్పటి వైస్ చైర్మన్ గా ఉన్న కాట్రాల రోశయ్య ను తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. డైరెక్టర్లు రోశయ్య పై కూడా అవిశ్వాసం పెట్టారు.
దీంతో 11మంది డైరెక్టర్లతో అసిస్టెంట్ రిజిస్టార్ సీహెచ్ రవికుమార్ 20న కామేపల్లి సొసైటీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాటరీ పద్ధతిలో వెంకటనర్సమ్మను తాత్కాలిక వైస్ చైర్మన్, చైర్మన్ గా ఎన్నిక చేస్తూ బాధ్యతలు అప్పగించారు. వైస్ చైర్మన్ ను నియమించాలని సహకార అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మరోసారి 11మంది డైరెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వైస్ చైర్మన్ గా రాంబాబు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చైర్మన్ ను ఎన్నిక చేసే వరకు తాత్కాలిక చైర్మన్ గా రాంబాబు కొనసాగుతారని అసిస్టెంట్ రిజిస్టార్ రవికుమార్ ప్రకటించారు. రాంబాబు వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గింజల నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నల్లమోతు లక్ష్మయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపూరి మహేందర్ కుమార్, దమ్మలపాటి సత్యనారాయణ, పుచ్చకాయల వీరభద్రం, ఎస్ కే ఫత్తే అహ్మద్, మండల కాంగ్రెస్ నాయకులు నల్లమోతు వెంకటనర్సయ్య, వరికొల్లు సైదులు, మాలోత్ బావ్ సింగ్, ప్రేమ్, తుమ్మలపల్లి వీరయ్య, బత్తుల నాగరాజు, దొడ్ల వేణు, సీఈవో జీ.నాగయ్య పాల్గొన్నారు.