
చండీగఢ్: ఇండియన్ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో రాంబాబు గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. 35 కిలోమీటర్ల రేస్ వాక్‌లో అతను చాంపియన్‌గా నిలిచాడు. నేషనల్ రికార్డ్ హోల్డర్ అయిన రాంబాబు 2 గంటల 32 నిమిషాలు 53.50 సెకండ్లలో రేస్‌ను పూర్తి చేశాడు. మరోవైపు విమెన్స్35 కిమీ రేస్ ముగిసినప్పటికీ ఆర్గనైజర్స్ ఫలితాలు ప్రకటించలేదు. సాంకేతిక కారణాల వల్ల ఫలితాలు ప్రకటించలేకపోయామని తెలిపారు.
రన్నర్లు పూర్తిగా 35 కిలోమీటర్లు కాకుండా కేవలం 34 కిలోమీటర్లకే పరిమితమయ్యారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. విమెన్స్ రేస్‌లో రైల్వేస్‌కు చెందిన పాయల్, పంజాబ్‌కు చెందిన మంజు రాణి, రమణ్‌దీప్ కౌర్ వరుసగా ఎండ్‌లైన్ దాటినట్లు
కనిపించింది.