
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో మొట్ట మొదటి అసెంబ్లీ సెగ్మెంట్ సిర్పూర్కాగజ్నగర్. ఈ సెగ్మెంట్లో తొలి ఓటరుగా పెద్ద మాలిని గ్రామానికి చెందిన కినక సుమనా బాయి ఉండేవారు. ఆమె చనిపోవడంతో ఆమె కోడలు సుర్పం మారుబాయికి జాబితాలో చోటు దక్కింది. అయితే ఓటరు జాబితా సవరణలో ఇటీవల ఎన్నికల అధికారులు ప్రకటించిన తుది ఓటరు జాబితాలో ఇంటి పేరు, ఇంటి నంబర్ ప్రకారం.. చిన్న మాలినికి చెందిన ఆత్రం రంభాబాయి తొలి ఓటరు అయ్యారు.
ALSO READ: బీఆర్‌ఎస్ అభ్యర్థులకు అసంతృప్తుల టెన్షన్
నంబర్ వన్ పోలింగ్ కేంద్రం, నంబర్ వన్ ఓటర్ గా మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళా ఉండటం విశేషం. 430 మంది ఓటర్లు ఉన్న ఈ తొలి పోలింగ్కేంద్రం ఉన్న గ్రామం.. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండల కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.