కంది, వెలుగు : సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గురువారం రాథోడ్ రాంచందర్ నాయక్ ఎన్నికయ్యారు. శుక్రవారం కమిటీ ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, సభ్యులుగా యశోద, రంగయ్య, చంద్రయ్య, సయ్యద్ మోయిజుద్దీన్, నర్సింహారెడ్డి, మహేశ్, మోహన్ రావు, బుచ్చిలింగం, రాధాకృష్ణ, దూదిసింగ్, రవీందర్‌రెడ్డి, జితేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ సందర్భంగా రామచందర్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవిలు రావడానికి కృషి చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో పాటు పార్టీ హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.