విడుదలకు ముందే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత పెద్ద కటౌట్ ఏ హీరోకి ఏర్పాలు చేయలేదు. ఇప్పుడు సినీ ప్రపంచంలో ఎక్కడ చూసినా 256 ఫీట్ల కటౌట్ గురించే చర్చ నడుస్తోంది.
ఈ భారీ కటౌట్ ను రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘రామ్ చరణ్ యువశక్తి’ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేశారు. సినిమా నిర్మాత దిల్ రాజు ఈ కటౌట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంతపెద్ద కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు దిల్ రాజు. ఈ భారీ కటౌట్ పై హెలికాప్టర్‌లో నుంచి పూల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఫ్యాన్స్ హాజరై ఈవెంట్ ను సక్సెస్ చేశారు.
Also Read : అల్లు అర్జున్ ఫ్యాన్స్పై చర్యలు తీసుకోండి
త్వరలోనే గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ చేస్తామని ఈ సందర్భంగా దిల్ రాజు చెప్పారు. అదే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డేట్స్ ఫిక్సయ్యాక ప్రిరిలీజ్ ఈవెంట్ ఉంటుందని అన్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న గేమ్ ఛేంజర్ కటౌటే కాదు.. సినిమా కూడా రికార్డ్స్ సృష్టిస్తుందని అన్నారు. రామ్ చరణ్ యాక్షన్ వేరే లెవల్ లో ఉంటుందని తెలిపారు.