రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తేనే చెప్పులు, బూట్లు ధరిస్తానని ఆరేళ్ల క్రితం శపథం చేసిన ఓ నాయకుడి కల నెరవేరింది. ఆరేళ్ల నుంచి ఆ నాయకుడు బూట్లు, చెప్పులు వేసుకోకుండా పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పని చేశాడు. ఆయన తలచినట్లుగానే మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడంతో ఇవాళ (డిసెంబర్ 23న) షూస్ వేసుకున్నారు.
2018లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటి నుంచి బీజేపీ విజయం సాధించే వరకు చెప్పులు తొడగనని బీజేపీ అనుప్పూర్ జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా ఉన్న రాందాస్ పూరి శపథం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆరేళ్ల విరామం తర్వాత డిసెంబర్ 23న తన కాళ్లకు బూట్లు తొడిగారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ఆయనకు షూలను అందించారు.
रामदास पुरी जैसे कार्यकर्ता पार्टी की शक्ति और पूंजी हैं...
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 23, 2023
अनूपपुर के भाजपा जिला अध्यक्ष श्री रामदास पुरी जी ने संकल्प लिया था कि जब तक प्रदेश में भाजपा की सरकार नहीं बनेगी, तब तक वे जूते चप्पल नहीं पहनेंगे।
प्रदेश में भाजपा की सरकार बन गयी और उनका संकल्प पूरा होने पर हमने… pic.twitter.com/3Q50QThen3
దీనికి సంబంధించిన వీడియోను శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. ‘రామదాస్ పూరీ కష్టపడి పనిచేసే వ్యక్తి. అతను 2017 నుండి బూట్లు, చెప్పులు వేసుకోకుండా పార్టీ కోసం పని చేశాడు. ఇప్పడు ఆయన శపథం నెరవేరింది’ అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 163 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కేవలం 66 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది.