యోగా గురూ రామ్‌దేవ్ బాబా గురించి తెలియనివారుండరు. 54 ఏళ్ల వయసులోనూ క్లిష్టమైన ఆసనాలు వేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటాడాయన. ఆయన సోమవారం మధురలోని మహావన్‌లోని రామనారెటి ఆశ్రమంలో ఏనుగుపై యోగ ఆసనాలు వేస్తుండగా ఒక్కసారిగా కిందపడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఆయనకు గాయాలేవీ కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అయింది.
ఆ వీడియోలో రామ్‌దేవ్ బాబా ఏనుగు పైన కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఆయన ఏనుగు వెనుక భాగంలో కూర్చొని యోగా చేస్తుండగా.. ఒక్కసారిగా ఏనుగు ముందుకు కదిలింది. దాంతో ఆయన కిందపడ్డారు. వెంటనే నవ్వుతూ లేచిన ఆయన దుమ్మును దులుపుకుంటూ ముందుకు వెళ్లారు.