- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్ బాబు
ముషీరాబాద్,వెలుగు: మాలలు రాజకీయంగా ఎదగడానికి అన్నిరాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని వివిధ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాలలకు 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలని ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పదవుల్లోనూ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో కొండ్ర రాజలింగం, మల్లెల వెంకట్రావు, వల్లిక కృష్ణమూర్తి, నర్సింగరావు, శ్రవణ్ కుమార్, శ్రీధర్ రావు, రాందాస్, కోటేశ్వరరావు, అశోక్, నగేశ్ పాల్గొన్నారు.