సమస్యలు పరిష్కారం కాకపోతే   నేనే పోరాటం చేస్తా : రమేశ్‌‌‌‌బాబు

వేములవాడ, వెలుగు : ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కాకుంటే తానే పోరాటం చేస్తానని, ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానని  వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌‌‌‌బాబు అన్నారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురం జీపీ భవనాన్ని బీఆర్ఎస్​అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  తాను మంత్రినై ఉంటే ముంపు గ్రామాల సమస్యలు లేకుండా చేసేవాడినన్నారు. ఒకానొక దశలో మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌తోనూ ముంపు గ్రామాలు సిరిసిల్లలో ఉంటే ఎప్పుడో సమస్య పరిష్కారమయ్యేదని అన్నానని ఎమ్మెల్యే అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎక్కని గడప లేదని, కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశానని ఎమ్మెల్యే వాపోయారు.